Amit Shah: 'మహిళలు రాష్ట్రంలో సురక్షితంగా లేరు': బెంగాల్ పర్యటనలో అమిత్ షా

by S Gopi |
Amit Shah: మహిళలు రాష్ట్రంలో సురక్షితంగా లేరు: బెంగాల్ పర్యటనలో అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో మహిళలు సురక్షితంగా లేరనేందుకు సందేశ్‌ఖాలీలో మహిళలలపై జరిగిన దాడి, ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో జరిగే చొరబాట్లు, అవినీతిలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రమేయం ఉందని ఆదివారం ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగానే బెంగాల్‌లో బీజేపీ సభ్యత్వం కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. రాష్ట్రంలో కోటి మంది సభ్యులను పొందాలనే లక్ష్యంతో ఉంది. 2026లో జరిగే ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఎన్నికయ్యేలా సమిష్టి కృషికి అమిత్ షా పిలుపునిచ్చారు. అవినీతి, చొరబాట్లను నిలువరించేందుకు ఇదే ఏకైక మార్గమని షా పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బెంగాల్‌లో కొన్ని సీట్లు వచ్చాయి కాబట్టి మనం ఖాళీగా ఉన్నామని మమతా బెనర్జీ భావించకూడదని పార్టీ సభ్యులను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. బెంగాల్ నుంచి 30 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలవాలని షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ఆందోళనలు ఉన్నాయని, సందేశ్‌ఖాళీ, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంఘటనలు ఇందుకు సాక్ష్యం. బెంగాల్‌లో తల్లులు, సోదరీమణులు సురక్షితంగా లేరని, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story