Naga Chaitanya: పెళ్లికి ముందు ఆ ఫొటో షేర్ చేసి షాకిచ్చిన నాగచైతన్య.. వైరల్‌గా మారిన పోస్ట్

by Hamsa |   ( Updated:2024-10-27 14:41:02.0  )
Naga Chaitanya: పెళ్లికి ముందు ఆ ఫొటో షేర్ చేసి షాకిచ్చిన నాగచైతన్య.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Nagarjuna) కొడుకు నాగచైతన్య(Naga Chaitanya) ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత లవ్ స్టోరీ(Love Story), మజిలీ, ఏమాయ చేశావే వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రజెంట్ చైతు చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’(Tandel) మూవీ చేస్తున్నారు. అయితే ఇందులో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక నాగచైతన్య(Naga Chaitanya) పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), చైతు ఏడేళ్లు ప్రేమించుకున్నారు.

2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నాలుగేళ్ల తర్వాత 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ్ల(Shobitha Dhulipalla)తో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన చైతు.. ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే ఇటీవల శోభిత(Shobitha Dhulipalla) పసుపు దంచే ఫొటోలు కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, నాగచైతన్య(Naga Chaitanya) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పోర్ట్స్ కారు(sports car)తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో కారు డ్రైవర్ సీటు వైపు డోర్ తెరిచి ఉండగా.. హెల్మెట్ ధరించిన చైతు దానివైపు చూస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

అంతేకాకుండా ఈ ఫొటోకు ‘‘992gt3rs రెక్కలు ఇస్తుంది. కానీ ఎగర కూడదు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రజెంట్ నాగచైతన్య(Naga Chaitanya) పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అందరూ పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తారనుకుంటే కారుతో ఉన్న పిక్ షేర్ చేసి షాకిచ్చాడని చర్చించుకుంటున్నారు. అలాగే రేసింగ్‌కు దూరంగా ఉంటానని ఇటీవల కామెంట్స్ చేసిన ఆయన మళ్లీ స్పోర్ట్స్ కారుతో కనిపించడంతో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story