KCR: తక్షణమే సోదాలు ఆపేయండి.. డీజీపీ జితేందర్‌కు కేసీఆర్ ఫోన్

by Gantepaka Srikanth |
KCR: తక్షణమే సోదాలు ఆపేయండి.. డీజీపీ జితేందర్‌కు కేసీఆర్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse) ఘటనపై బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన డీజీపీ జితేందర్‌(Telangana DGP Jitender)కు ఫోన్ చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే సోదాలు ఆపేయాలని డీజీపీ(DGP)ని కోరారు. కాగా, హైదరాబాద్ శివారు రాయదుర్గంలోని ఓరియన్‌ విల్లాస్‌లో రాజ్‌ పాకాల సోదరుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

జన్వాడ ఫామ్‌హౌజ్‌(Janwada Farmhouse) రేవ్‌పార్టీ వ్యవహారంలో కేటీఆర్(KTR) బంధువు రాజ్‌ పాకాల సోదరుడి ఇంట్లో ఎక్సైజ్‌శాఖ(Excise Department) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారని బీఆర్ఎస్ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న కేసీఆర్.. డీజీపీకి ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తనిఖీలు ఆపేయాలని రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story