నిత్య నిర్బంధాలలో నమ్మిన సిద్దాంత వెలుగు.. రడం శ్రీను..

by Sumithra |
నిత్య నిర్బంధాలలో నమ్మిన సిద్దాంత వెలుగు.. రడం శ్రీను..
X

దిశ, జవహర్ నగర్ : కామ్రేడ్ రడం శ్రీను గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం తీరనిలోటని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఇఫ్టూ(శ్రామిక స్పందన) జాతీయ కార్యదర్శి షేక్ షావలి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు, కొమరారంకు చెందిన ప్రజా కళాకారుడు, కవి, ఉద్యమకారుడు కామ్రేడ్ రడం మరణానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశవ్యాప్తంగా వివిధ సెక్షన్ల ప్రజానీకం తమ మనుగడకు జరిపే పోరాటాలకు సంఘీభావంగా ఉద్యమించాడని షేక్ షావలి కొనియాడారు.

తన ఆట, మాట, పాట ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్న క్రమంలో ప్రశ్నించే గొంతుకగా మారాడని, తద్వారా రాజ్యాం ద్రుష్టిలో అది నేరంగా పరిగణించి, ఎన్నో తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు గురై, జైలు గోడలను కూడా ముద్దాడడాని అన్నారు. నిత్య నిర్భందాల మధ్య కూడా తను నమ్మిన సిద్దాంత వెలుగులో పయనించాడే తప్ప, ఎక్కడా కూడా రాజ్యానికి దడవలేదని గుర్తుచేశారు. ఎదురొడ్డి నిలబడి, చివర వరకు రాజీపడకుండా దోపిడీ, పీడన, అణిచివేతలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకు, ఆర్థిక, అసమానతలు లేని వ్యవస్థ నిర్మాణానికి తన జీవితాన్నే ఫణంగా పెట్టిన రడం శ్రీనుకు విప్లవ జోహార్లు తెలియజేశారు.

Advertisement

Next Story