పేద ప్రజలకు అండ సీఎం రిలీఫ్ ఫండ్ : Contonment MLA Sayanna

by Sridhar Babu |   ( Updated:2022-12-13 12:54:12.0  )
పేద ప్రజలకు అండ సీఎం రిలీఫ్ ఫండ్ : Contonment MLA Sayanna
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : పేదవారికి ఎలాంటి ఆపద వచ్చినా, తాను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు కేసీఆర్ అని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గంలోని ఏడో వార్డు చిన్న కమేల ప్రాంతానికి చెందిన దుర్గా ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. వైద్య ఖర్చులు అధికంగా ఉన్నాయంటూ, కట్టలేని పరిస్థితి ఉందని చెప్పడం తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను ఆశ్రయించగా సీఎం సహాయ నిధి నుండి రూ. లక్ష 50 వేల ఎల్ఓసీని బాధిత కుటుంబ సభ్యలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నివేదిత, నాగినేని సరిత, సదానంద్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed