- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం : బండి రమేష్
దిశ, కూకట్పల్లి : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ అన్నారు. మూసాపేట్ డివిజన్ పరిధి గూడ్ షెడ్ రోడ్డులో శనివారం హమాలి సంఘం సభ్యులతో బండి రమేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హమాలి సంఘం నాయకులు బండి రమేష్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాలు, అసంఘటిత కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణలో రానుంది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వంత ప్రయోజనాలే తప్ప వారికి ఏది ప్రాధాన్యం కాలేదని అన్నారు. కూకట్‌పల్లిలో మహాలీలు కనీసవసతులు లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. కార్మికలోకానికి పీజేఆర్ వంటి మహానాయకుడిని అందించింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. పీజేఆర్ అనంతరం కార్మికుల సమస్యల పై పోరాడిన, మాట్లాడిన వారు లేరని, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తే పీజేఆర్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని, బడుగు బలహీన వర్గాలు, కార్మిక లోకానికి అందుబాటులో ఉండి వారికి సేవలను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు నర్సింహా, శంకర్, రాజు, సచిన్, రేష్మ, మేసయ్య, రాఘవేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.