Shock to BRS: పీర్జాదిగూడ బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఇద్దరు కార్పొరేటర్‌లు

by Aamani |
Shock to BRS: పీర్జాదిగూడ బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఇద్దరు కార్పొరేటర్‌లు
X

దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీకు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన మరో ఇద్దరు కార్పొరేటర్లు 24 వ డివిజన్ కార్పొరేటర్ యంపల్లి అనంత రెడ్డి, పీర్జాదిగూడ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు బండారి రవీంద్ర సతీమణి 15 వ డివిజన్ కార్పొరేటర్ బండారు మంజుల రవీందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిని టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో కాంగ్రెస్ కు 21 మంది, బీఆర్ఎస్ కి 5 గురు కార్పొరేటర్లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story