బాధ్యతలు చేపట్టని ఏసీపీ.. బదిలీ అయ్యి రోజులు గడుస్తున్న ఖాళీ గానే ఉన్న కుర్చీ

by Aamani |
బాధ్యతలు చేపట్టని ఏసీపీ.. బదిలీ అయ్యి రోజులు గడుస్తున్న ఖాళీ గానే ఉన్న కుర్చీ
X

దిశ,పేట్ బషీరాబాద్: ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి బదిలీల లో భాగంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ ఏసీపీ గా ఉన్న సాయిబాబా శేరిలింగంపల్లి జోనల్ ఏసీపీ గా బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న సురేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ సర్కిల్ ఏసీపీ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ డీసీ నరసింహ ఆయనను రిలీవ్ చేయడంతో బదిలీ ఆర్డర్ వచ్చిన మరుసటి రోజు నే సాయిబాబా శేర్లింగంపల్లి జోనల్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.

అయితే శేరిలింగంపల్లి నుంచి రావాల్సిన సురేందర్ రెడ్డి మాత్రం కుత్బుల్లాపూర్ సర్కిల్ లో బాధ్యతలు చేపట్టలేదు. బదిలీ ఆర్డర్స్ వచ్చి రోజులు కట్టిస్తున్న ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీ కుర్చీ ఖాళీగా కనిపిస్తోంది. ఈ విషయమై కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నరసింహ మాట్లాడుతూ కొత్తగా రావాల్సిన ఏసీపీ సురేందర్ రెడ్డి ఇంకా రిపోర్టు చేయలేదని, ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed