- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాత్రల పేరిట భారీ మోసం
దిశ,ఉప్పల్ : శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో కోట్లల్లో వసూళ్లు చేసి భారీ మోసానికి పాల్పడినట్టు బాధితులు ఆందోళన చేశారు. ఉప్పల్ కళ్యాణపురిలో భరత్ కుమార్ అనే వ్యక్తి శ్రీగాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్నాడు. మానస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ చేసుకుంటూ గత ఐదు ఏళ్ల నుండి దాదాపు రూ.15 కోట్లు వసూళ్లు చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద భారీగా వసూళ్లు చేశాడు. ఇప్పుడు అప్పుడు అంటూ గత మూడేళ్ల నుంచి కరోనా పేరు చెప్పి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు.
ఒక్కొక్కరి నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూళ్లు చేశాడని బాధితులు తెలిపారు. గతంలో బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో భరత్ కుమార్ శర్మ మీద ఫిర్యాదు చేయడంతో నిర్వాహకుడు భారత్ కుమార్ శర్మని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భరత్ కుమార్ శర్మ బెయిల్ పై బయటికి వచ్చి మళ్లీ యాత్రల పేరిట వసూలు చేస్తున్నాడని, ఆయన్ని అరెస్ట్ చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఎస్ఐ మాధవరెడ్డి బాధితులతో మాట్లాడి దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.