Minister Damodara Rajanarsimha : మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

by Sridhar Babu |
Minister Damodara Rajanarsimha : మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందడం తనను తీవ్రంగా కలిచి వేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మంత్రి మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పుల్కల్ మండలానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగారెడ్డి వద్ద 161 వ జాతీయ రహదారిపై ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం గంగోజుపేటకు చెందిన సందీప్, నవీన్, గొంగులూరు గ్రామానికి చెందిన అభిషేక్ లు కంది అక్షయపాత్రలో పనిచేస్తున్నారని, ఈ ముగ్గురు యువకులు బైక్ పై డ్యూటీకి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమన్నారు. మృతి చెందిన యువకులకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు.

Advertisement

Next Story