- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సైబర్ బాధితుల సత్వర న్యాయానికి బ్యాంకర్స్ పాత్ర కీలకం
దిశ, సంగారెడ్డి : సైబర్ నేరాల దర్యాప్తులో బ్యాంకర్స్ పోలీసులకు సహకరించాలని, బాధితుల సత్వర న్యాయానికి బ్యాంకర్ల పాత్ర కీలకమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. గురువారం సైబర్ నేరాల నివారణ, బాధితులకు సత్వర న్యాయానికి జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకొని ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో అంతే వేగంగా వివిధ రకాల నేరాలు పుట్టుకొస్తున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగి, క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో అడ్డ దారిలో డబ్బులు సంపాదించాలని, ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా కేవలం యూపీఐ, బ్యాంక్ అకౌంట్ లను ఆధారంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తప్పుడు మార్గాలను ఎంచుకొని, అమాయక ప్రజలే టార్గెట్ గా వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు.
సైబర్ నేరాలకు సంబంధించి బ్యాంక్ సిబ్బంది దర్యాప్తు అధికారులకు సహకరించాలని, నేరానికి గురైన బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గం అని, వాట్సప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానిత లింక్ లను, apk ఫైల్స్ ఓపెన్ చేయరాదన్నారు. సైబర్ మోసానికి గురయితే 1930 కి కాల్ చేసి కానీ లేదా www.cybercrime.gov.in లో సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డీఎస్సీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్సీ రామ్ మోహన్ రెడ్డి, నారాయణ ఖేడ్ డీఎస్సీ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్సీ వేణు గోపాల్ రెడ్డి, నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన అధికారులు, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ పాల్గొన్నారు.