మూడు రోజులుగా వృధాగా పోతున్న భగీరథ నీళ్లు..

by Sumithra |
మూడు రోజులుగా వృధాగా పోతున్న భగీరథ నీళ్లు..
X

దిశ, అల్లాదుర్గం : మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయ్యి గత మూడు రోజుల నుంచి తాగునీరు వృధాగా రోడ్డుపై పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామానికి వెళ్లే చౌరస్తా వద్ద రోడ్డు పై భగీరథ నీళ్లు నిలువ ఉండడం వల్ల గ్రామానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

భగీరథ పైప్ లైన్ లీకేజీ మూడు రోజులుగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. రోడ్డు పై నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు కానీ, మిషన్ భగీరథ అధికారులు కానీ ఆ వైపు చూడకపోవడం పై అధికారుల పని తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకైన పైప్ లైన్ మరమ్మతులు చేసి రోడ్డు పై నీటి నిల్వను పక్కకు మళ్ళించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed