అధికారుల మధ్య వాగ్వివాదం.. కారణం ఇదే..?

by Kalyani |
అధికారుల మధ్య వాగ్వివాదం.. కారణం ఇదే..?
X

దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని శివానగర్ గ్రామ శివారులో గల టీఎస్ఐఐసీ పరిధిలోని శిఖం భూమిలో ఓ పరిశ్రమకు స్థలం కేటాయించిన విషయంలో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సర్వే జరిపించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు టీఎస్ఐఐసీ అధికారులు సూచించారు. కాగా గురువారం టీఎస్ఐఐసీ అధికారులు పరిశ్రమకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశ్రమకు కేటాయించిన స్థలాన్ని సర్వే చేయకపోవడంతో ఆయా శాఖలకు అధికారుల మధ్య వాగ్వివాదం జరిగింది. త్వరలోనే కుంట కు సంబంధించిన స్థలంలో సర్వే జరిపి నివేదిక అందిస్తామని రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed