యువత చెడిపోవడానికి అదే ప్రధాన కారణం

by Sridhar Babu |
యువత చెడిపోవడానికి అదే ప్రధాన కారణం
X

దిశ, సంగారెడ్డి : యువత చెడిపోవడానికి అదే ప్రధాన కారణం అని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలని సూచించారు. శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడం వాక్ కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు. ఒక వ్యక్తి జీవితంలో మొదటి 25 సంవత్సరాలు చాలా కీలకం అని, కష్టపడి చదివి గోల్స్ ను నెరవేర్చుకున్నట్లైతే జీవితం చాలా అందంగా ఉంటుందన్నారు.

గుట్కా, సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చేదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు. విద్యార్థిని, విద్యార్థులుగా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని నెరవేర్చుకునే దిశగా కృషి చేయాలి కానీ అనవసర చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు దేశానికి భారంగా మిగలకూడదన్నారు. భారత దేశ పౌరులుగా పుట్టడం మన అదృష్టమని, దేశానికి ఏదోరకంగా ఉపయోగపడాలి అన్నారు. నూతన చుట్టాల గురించి అవగాహన కలిగి మంచి మార్గంలో నడవాలని యువతకు దిశా నిర్దేశం చేశారు.

డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలన విభాగం, జిల్లా పోలీసు శాఖ, సహార హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం వాక్ లో సంగారెడ్డి పట్టణ ప్రజలు, ఔత్సాహికులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఫ్రీడం వాక్ ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహార హాస్పిటల్స్ డైరెక్టర్ శంకర్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, యువజన సంఘాల నాయకులు కూన వేణు, సంగారెడ్డి నార్కోటెక్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఇంటలిజెన్స్ డీఎస్పీ మురళి, సంగారెడ్డి టౌన్, రూరల్ ఇన్స్పెక్టర్స్, ఎస్సై, సహార హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed