విద్యార్థులు డ్రగ్స్ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి

by Kalyani |
విద్యార్థులు డ్రగ్స్ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి
X

దిశ, సంగారెడ్డి : విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఇష్ట గ్రూప్ న్యూ క్యాంపస్ ను ప్రారంభించారు. ఈసందర్బంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… విద్యార్థులు తమ తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలను చేసుకోవాలన్నారు. సమాజానికి హాని కలిగిస్తున్న డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాలను చేరుకుని సమాజానికి దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చదువులో ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ రామయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్, ఇష్ట ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ కార్తీక్, అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్, జూనియర్ కళాశాల డైరెక్టర్ వినోద్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కిరణ్ రెడ్డి, అకడమిక్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ఇబ్రహీం, కళాశాల అధ్యాపకుల బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed