రాష్ట్రంలో 8 వేల మంది ఆత్మహత్యలు : రాహుల్ గాంధీ

by Sumithra |
రాష్ట్రంలో 8 వేల మంది ఆత్మహత్యలు : రాహుల్ గాంధీ
X

దిశ, సంగారెడ్డి : బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందని, ధరణి పోర్టల్ లో పేదల భూములు గుంచుకున్నారని, కాంప్యూటరైజేషన్ చేస్తామని 20 లక్షల భూములు లాక్కున్నారని ఆరోపించారు.

అదే విధంగా కాళేశ్వరం డ్యామ్ లో లక్షా కోట్లు మింగారన్నారు. నేను స్వయంగా డ్యాంను పరిశీలించానని, డ్యాం కిందకు కుంగి పోయిందన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో యువతను కలిశాను, వాళ్లు లక్షల రూపాయలను కోచింగ్ , స్టడీ పేరున పీజులు ఖర్చు చేశారని కానీ వారికి ఉద్యోగాలు రాలేదన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం లక్షలమంది లైన్ లో నిలబడి ఉన్నారని, వారి కోసం కేసీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. తెలంగాణను ముందుకు తీసుకు వెళ్లేందుకు యువకులు ఇన్నారు. మీకు ఈ ప్రభుత్వం పరిపాలన గత ప్రభుత్వం తేడా గమనించాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు ఖర్చు చేసిన ప్రతి పైసా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చట్టం కింద మార్చుతామన్నారు. మహిళలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.12 వందలకు గ్యాస్ సిలిండర్ వస్తుంది. కాంగ్రెస్ రూ.5 వందలకు ఇస్తుందన్నారు. అదే విధంగా బస్సులో ప్రయాణించేందుకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు నెలకు రెండు వేలు ఖర్చు వస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రతి నెల రూ.2500 వందలు ఇస్తుందన్నారు. గ్యాస్ ను రూ.500 ఇవ్వడంతో పాటు ఉచిత ప్రయాణం, నెలకు రూ.2500 కలిపి ప్రతి నెల మహిళలకు రూ. 5 వేలు కాంగ్రెస్ ఇస్తుందన్నారు.

రైతులు 8వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని, వారికి మద్దతుగా ఉంటామని, ప్రతి సంవత్సరం రూ.15వేలు బ్యాంకు అకౌంట్లో వేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు కూలీలకు రూ.12వేల ఇస్తామని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా పింఛను దారులకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పాఠశాలలు, యూనివర్శిటీలను ప్రైవేట్ చేసిందని, తెలంగాణలో అన్ని మండల కేంద్రాల్లో ఇంటర్నేషనల్ పాఠశాలలు కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు చదువుకు తోడ్పాటు అందించేందుకు యూనివర్శిటిలో చదువుతున్న వారికి విద్యకు 5 లక్షలు ఇస్తామన్నారు. గృహ జ్యోతి పథకం కింది రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని ఎవ్వరూ బిల్లు కట్టవద్దన్నారు.. ఇవన్నీ మొదటి క్యాబినెట్ లో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.

బీజేపీ గాలి తీసివేశాం..

బీజేపీ గాలి రాష్ట్రంలో మొత్తం తీసివేశామని, వారి కారుకున్న నాలుగు చక్రాల గాలీ మొత్తం తీసివేశామని రాహుల్ గాంధీ తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి లోక్ సభలో మద్దతు ఇస్తుంది ఎలా అంటే జీఎస్టీ, నోట్ల రద్దులో మద్దతు, రైతు బిల్లుకు మద్దతు తెలిపిందన్నారు. నేను మోడిని లోక్ సభలో చుట్టుముట్టాలని పోతే బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. వీళ్ల బందం అంతా ఇంత కాదు ఎన్ని అక్రమాలు, దుర్మార్గాలు చేసిన కేసీఆర్ వద్దకు ఈడీ, ఐటీ రాదన్నారు. కానీ బీజేపీ నాపై 24 కేసులు పెట్టిందని, నా ఇల్లు గుంజుకున్నారని, తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారన్నారు. కానీ నేను ఇల్లువదు కోట్లాది ప్రజల గుండెల్లో ఉంటా. కేసీఆర్ పూర్తి మద్దతు బీజేపీకి ఉంటుంది. ప్రతి అంశంలో తెలంగాణకు మోడీ మద్దతు, లోక్ సభలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలుపుతుందన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యమని, రేపు తెలంగాణలో గెలిచిన తర్వాత రేపుడిల్లీలో బీజేపీని ఓడిస్తామన్నానరు. ఇవి రెండు దొరల సర్కారు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మనం ప్రజల తెలంగాణ ఏర్పాటు చేస్తాం. మూడో పార్టీ ఎంఐఎం మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుందో అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబడుతుందన్నారు. ఎంఐఎంకు క్యాండెట్ ను బీజేపీ ఇస్తుందని ఆరోపించారు. దేశంలో నరేంద్ర మోడీ విద్వేషాన్ని రెచ్చగొడుతూ దేశం విలువ తగ్గిస్తుందన్నారు. అందుకోసమే మేము విద్వేషాల బజారులో ప్రేమదుకాణం పెట్టామన్నారు. దాని కోసం అందరి మద్దతు కావాలని తెలంగాణలో కూడా ప్రేమ కొట్టు పెడుతుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మానిక్ రావు ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇంచార్జీ సురభీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కూచి, పీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed