- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రోటోకాల్ చిచ్చు…చేప పిల్లల విడుదలలో వివాదం
దిశ, నర్సాపూర్ : ప్రోటోకాల్ వివాదం ఇద్దరు మహిళా నేతల మధ్య రగడ సృష్టించింది. ప్రోగ్రాం ఆలస్యం కావడంతో అలిగి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి వెళ్లిపోగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. వివరాల్లోకెళితే నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో చేప పిల్లల విడుదల కోసం మత్స్యశాఖ అధికారులు మంగళవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ఆహ్వానం పంపడంతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి కి ఆహ్వానం పంపారు. అయితే అధికారులు ఈ సందర్భంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే సునీత రెడ్డి తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిల ఫోటోలను వేశారు.
అయితే అందులో ఎమ్మెల్యే సునీత రెడ్డి ఫోటో చిన్నగా ఉందని ఆమె కార్యక్రమానికి రావడానికి నిరాకరించారు. అంతకుముందు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి చెరువు వద్దకు వచ్చి గంట వరకు నిరీక్షించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యక్రమానికి రాకపోవడంతో మత్స్య శాఖ ఏడి మల్లేశం తో పాటు స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పి కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి కారు దిగి వస్తున్న క్రమంలో వెంటనే గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కారు ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యే సునీత రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు.