- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు రోజుల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పేట పోలీసులు..
దిశ, పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్ద శంకరంపేటలోని వెంకటేశ్వర కాలనీ లో పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పెద్ద శంకరంపేట పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి(CI Renuka Reddy) ఆదివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే పెద్ద శంకరంపేట లోని వెంకటేశ్వర కాలనీ లో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సీమన్ ఇంటికి తాళం వేసి వెళ్లడంతో గుర్తుతెలియని వ్యక్తులు 8 తులాల బంగారం, 20 తులాల వెండి కొంత నగదును దొంగలించారు. పెద్ద శంకరంపేట పోలీసులు ఈ కేసును వెంటనే చేదించి జగిత్యాల జిల్లా మెట్పల్లి కి చెందిన వెల్లపు కాశీరాం..మెట్పల్లికి చెందిన వెల్లపు నిర్మల..కామారెడ్డి జిల్లా గ్రంధానికి చెందిన వడ్డే శ్రీకాంత్ లు దొంగిలించడంతో వారి వద్ద నుండి 8 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు వివరించారు. పెద్ద శంకరంపేట పోలీసులు మూడు రోజుల్లోనే దొంగతనానికి సంబంధించిన కేసును చేదించడంతోపాటు దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడం పట్ల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పేట ఎస్సై శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.