SP Uday Kumar Reddy : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

by Sridhar Babu |
SP Uday Kumar Reddy : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, పాపన్నపేట : నిర్విరామంగా కురుస్తున్న ముసురు వానలకు పాత ఇండ్లలో ప్రజలు ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఉన్న వనదుర్గ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల గురించి, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్విరామంగా కురుస్తున్న ముసురు వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురాతన ఇళ్లలో ఉన్న ప్రజల సమాచారం తెలుసుకొని ఎవరైనా ప్రమాదంలో ఉంటే

సంబంధిత అధికారుల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వర్షాలు పడుతున్నప్పుడు కరెంటు ట్రాన్స్ఫార్మర్, స్తంభాలను ముట్టుకోకుండా వాటికి చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని సూచించారు. అలాగే ప్రజలకు ఏ విధమైన సేవలు అందించడానికి అయినా జిల్లా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లే రైతులు బోరు మోటారు వేసే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100 కానీ, పోలీస్ స్టేషన్ కి కానీ సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ సంగమేశ్వర్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed