కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసి పోయింది

by Disha Web Desk 22 |
కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసి పోయింది
X

దిశ, ఆందోల్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ల ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రూ. 3 మూడు లక్షల కోట్లు కావాలి ఎక్కడికెళ్లి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. పదవులు, అధికారం, వ్యాపారాల కోసం వచ్చిన స్వార్ధపరులు, మోసకారులే పార్టీ మారుతున్నారని ఆయన ఆరోపించారు. బీబీ పాటిల్ పెద్ద మోసకారి అన్నారు. ⁠మొదటి నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీలో ఉన్నారన్నారు. కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీజేపీ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ⁠పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఓట్లు వేసి బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు.

గ్రామాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. గాలి అనిల్ కుమార్ విజయానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలన్నారు. ⁠అనిల్ కుమార్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతానికి రైల్వే లైన్ తీసుకొస్తాం అన్నారు. అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ⁠పిరికెడు మందితో ఉద్యమం ప్రారంభించి తెలంగాణ సాధించాం అన్నారు. మన యాస, భాష, మన కష్టనష్టాలు పార్లమెంట్‌లో వినిపిస్తానన్నారు. పార్లమెంట్‌లో మీ గొంతుకగా నిలుస్తానని తెలిపారు.

మోస పూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ మోసం తెలిసిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అందోల్, మునిపల్లి జడ్పీటీసీ రమేష్, మీనాక్షి సాయి కుమార్, ఎంపీపీ జోగు బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ లు పి. నారాయణ, డిబి. నాగభూషణం, పల్లె సంజీవయ్య, రజనీకాంత్, మాజీ ఎంపీపీ రామ గౌడ్, మాజీ కౌన్సిలర్ తుపాకుల సునీల్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సార శ్రీధర్, నాయకులు చాపల వెంకటేశం, బిర్లా శంకర్, మహేష్ యాదవ్, నాగరత్నం గౌడ్, నాయి కోటి అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed