SP Uday Kumar Reddy : గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలి

by Sridhar Babu |
SP Uday Kumar Reddy : గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలి
X

దిశ, పాపన్నపేట : జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ లోని గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. ముందుగా పోలీసు అమరుల స్థూపం, పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసులకు సబంధించిన రికార్డులను పరిశీలించారు. తదుపరి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఏడుపాయల్లోని మంజీరాలో యువకులు ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్న నేపథ్యంలో పలు రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో పాత ఇండ్లు, గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న నివాసాలలో

ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల దృష్ట్యా 24 గంటల పాటు పెట్రో, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని, నది తీర గ్రామాలలో, చెరువు అలుగు వద్ద పెద్దలు తమ పిల్లలను నదులలోకి, అలుగుల వద్దకు వెళ్లకుండా చూడాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సిబ్బందికి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం గురించి అవగాహన కల్గివుండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ అవడానికి కమ్యూనిటీ పోలిసింగ్, ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని అమలు పరచాలని,

అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీసులకు సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాణంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కేసుల దర్యాప్తులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పద్ధతులను పాటించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ వాహనాలను నిరంతరం గస్తీలో తిప్పాలని, బీట్లు,పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాల టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు చేయడానికి సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఆ ప్రదేశంలో నేరాలు ప్రభావితంగా నిరోధించగలమని, నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు ఛేదనకు దోహదపడే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ నరేష్, సిబ్బంది ఉన్నారు.



Next Story