- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..
దిశ,పటాన్ చెరు : ఇంటి నెంబర్ జారీకి ఇంటి యజమానికి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కాడు ఓ పంచాయతీ కార్యదర్శి. మెదక్ జోనల్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించిన వివరాల ప్రకారం… గతంలో ఐలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సచిన్ కుమార్ ఆ గ్రామానికి చెందిన స్వర్ణలత అనే మహిళ ఇంటికి గానూ ఇంటి నెంబర్ కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించారు. అయితే సదరు కార్యదర్శి సచిన్ ఇంటి నెంబర్ కోసం రూ. 30 వేలు లంచంగా డిమాండ్ చేశారు. ఐతే బాధితులు మొదటి దఫా లో పది వేలు చెల్లించారు. ఆ తర్వాత మిగిలిన రూ.20 వేల ను మరొక దఫాలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గృహ యజమాని భర్త మల్లేష్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు సెప్టెంబర్ నెల 26న అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర హోటల్ కు పంచాయతీ కార్యదర్శి నీ పిలిచి బేరసారాలు అడగా చివరికి రూ.15 వేలు ఇవ్వమని తేల్చి చెప్పాడు. అధికారుల సూచన మేరకు ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి ఏసీబీ అధికారులకు అప్పగించారు. ఆ వీడియో సాక్ష్యం తో గురువారం ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి సచిన్ ను అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయానికి పిలిచి విచారించారు. ఏసీబీ అధికారుల విచారణలో లంచం తీసుకున్న విషయం రుజువు కావడంతో పంచాయతీ కార్యదర్శి సచిన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి సచిన్ సదాశివపేట మండలం ఆత్మకూరు లో విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విచారణలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్ల తో పాటు పలువురు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.