- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్ .... స్పందించిన అధికారులు
దిశ, కొండాపూర్ : వరద కాలువలు పూడ్చి.. అక్రమ వెంచర్ అనే కథనాన్ని దిశ దినపత్రిక ప్రచురించడంతో అధికారులు స్పందించారు. అనుమతులు లేని వెంచర్‌కు నోటీసులు జారీ చేశారు. కొండాపూర్ మండలం మన్సాన్పల్లిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తూ ఆ భూమిలోని వరద కాలువలను పూడ్చి వేసిన ఘటనపై దిశ పత్రిక కథనం రాయగా రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించారు. వరద కాలువలను పూడ్చి వేసింది నిజమేనని అధికారులు తెలిపారు. వెంచర్‌లో పూడ్చి వేసిన వరద కాలువలను జేసీబీ సహాయంతో తవ్వివేశారు. అదే విధంగా అనుమతులు లేకుండా, భూమి కన్వర్షన్ లేకుండా వెంచర్ ఏర్పాటు చేయడం పై అధికారులు సీరియస్ అయ్యారు. రోడ్డుపై అందంగా ఏర్పాటు చేసిన సండే మార్నింగ్ విల్లా వెంచర్ ప్లెక్సీలను అధికారులు చించివేశారు. ఎవ్వరైనా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూల్చివేతల్లో ఎంపీఓ శ్రీనివాస్, మునిదేవుని పల్లి కార్యదర్శి కిషోర్ కుమార్, మాన్సాన్ పల్లి గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.