New laws:బాధితులకు మరింత న్యాయం చేకూరేలా కొత్త చట్టాలు

by Sridhar Babu |
New laws:బాధితులకు మరింత న్యాయం చేకూరేలా కొత్త చట్టాలు
X

దిశ, మెదక్ టౌన్ : బాధితులకు మరింత న్యాయం చేకూరేలా కొత్తచట్టాలను రూపొందించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి (District SP Uday Kumar Reddy)అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు నూతన చట్టాలు, వాటి అమలుపై జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యా అధినియం-2023 పై జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇది వరకే శిక్షణ ఇచ్చామని, జూలై ఒకటో తేదీ నుంచి ఇవి అమలులోకి వచ్చాయని అన్నారు.

ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో, శిక్షలలో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ఈ కొత్త చట్టాలు వీలుగా ఉంటాయన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్బీ సీఐ సందీప్ రెడ్డి, డీసీఆర్బీ సీఐ మధుసూదన్ గౌడ్, జిల్లా సీఐ లు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed