MLA Kotha Prabhakar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

by Aamani |
MLA Kotha Prabhakar Reddy :  కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
X

దిశ,దుబ్బాక : ఏ గ్రామానికి వెళ్లినా పారిశుద్ధ్యం పడకేసిందని, ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో వైద్య వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసిందని నేడు కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రులు కుంటు పడి రోగులు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.మంగళవారం దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... హామీలు నెరవేర్చే సత్తా లేకనే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. 8 మాసా లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఉన్న వ్యవస్థ ను నాశనం చేశారన్నారు.

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేడు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుణమాఫీ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, వారి కోసం హెల్ప్ డెస్క్ గ్రామాలలో పట్టణాలలో ఏర్పాటు చేసి త్వరిత గతిన రెండు లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా అమలు చేయాలన్నారు. పంట మధ్యలోకి వచ్చిన రైతు భరోసా ఇవ్వడం లేదని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ఒక స్తంభం కూడా ఇవ్వడం లేదన్నారు. కొత్త పింఛన్లు దేవునికి ఎరుక పాత పింఛన్లు సకాలంలో వేయాలన్నారు.సంక్షేమ హాస్థళ్ళలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, బెడ్స్ లేవని, కాస్మోటిక్ కు బిల్స్ ఇవ్వడం లేదన్నారు.

పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని, చెట్ల కొమ్మలు రోడ్డు మీదికి వస్తే తొలగించే వారు లేరన్నారు.ప్రజల పక్షాన మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రవీణ్ ఇటీవల మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. పలువురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొంపల్లి మనోహర్ రావు, రొట్టె రాజమౌళి,మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,కొత్త కిషన్ రెడ్డి, లింగం,వల్లల సత్యనారాయణ,జీడిపల్లి రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed