పాము వస్తుంది జాగ్రత్త.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

by Sumithra |
పాము వస్తుంది జాగ్రత్త.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : ఎన్నికల్లో గెలిపించాలని సంగారెడ్డి పాటు వస్తుంది జాగ్రత్త అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని గంజ్ మైదాన్ లో విజయభేరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి రాహుల్ గాంధీ ముందు పాట పాడారు. ఇవాళ నాకు మాట్లాడే మూడ్ లేదు 28 వ తేదీన మనం మళ్ళీ సభ పెట్టుకుందాం, 28 వ తేదీ నా పాము.. ముంగిస కథ చెప్తానని జగ్గారెడ్డి అన్నారు. పాము అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అభ్యర్థి అని తెలిపారు. అందులో ముంగిస.. జగ్గారెడ్డి అని, పాము ముంగిసలో ఏది ప్రమాదం.. పాము ప్రమాదం.. పాముతో కొట్లాడేది ముంగిసానే కదా.. పాము.. ముంగిసలో ఎవరు గెలుస్తారు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముంగిసాని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు పాము ఇంటింటికి వస్తుంది జాగ్రత్త అన్నారు.

ఐదు ఏండ్లకు ఒక్కసారి జేబులో చెయ్యి పెట్టె బీఆర్ఎస్ కావాలా.. ఎదురుపడ్డప్పుడల్లా.. జేబులో చేయి పెట్టె నేను కావాలా ఆలోచించాలన్నారు. ఇంటింటికి బీఆర్ఎస్ పాములు వస్తున్నాయి. రెండు వేలు ఇస్తున్నాయి జాగ్రత్త అన్నారు. 1980లో ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఇదే సంగారెడ్డి హెడ్ క్వాటర్స్ లో నామినేషన్ వేసి ఇదే గంజి మైదాన్ లో పబ్లిక్ ని అడ్రెస్స్ చేస్తూ మాట్లాడారని రాహుల్ గాంధీకి గుర్తు చేశారు. ఇప్పుడే అదే ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ అదే గంజి మైదాన్ లో పబ్లిక్ ని అడ్రెస్స్ చేస్తూ మాట్లాడారన్నారు. తనను సంగారెడ్డి ఆదరించాలని 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తోపాజీ అనంతకిషన్, ఇంచార్జీ సురభీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కూచి, కూన సంతోష్ కుమార్, జార్జీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed