Medak SP : ఇలాంటి పైరవీ లేకుండా పోలీసుల సేవలు వినియోగించాలి

by Aamani |
Medak SP : ఇలాంటి పైరవీ లేకుండా పోలీసుల సేవలు వినియోగించాలి
X

దిశ, మెదక్ టౌన్ : ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించు కోవాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించా ల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల ఎస్ఐ, సీఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితి ని, పరిష్కారానికి సూచనలు చేయడం జరిగిందని అన్నారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని అన్నారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేల, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story