- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటెల సమక్షంలో బీజేపీలో చేరికలు
దిశ, మనోహరాబాద్ : హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ సమక్షంలో మండలంలోని అగ్రహారం గ్రామ వార్డ్ మెంబర్ తో పాటు లింగారెడ్డి పేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం ఈటల నివాసంలో బీజేపీ పార్టీలో చేరారు. మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ చారి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్ గౌడ్ ల ఆధ్వర్యంలో అగ్రహారం గ్రామ వార్డు మెంబర్ అశోక్ ముదిరాజ్, లింగారెడ్డి పేట గ్రామం చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్తూరి చిన్న మల్లేష్ ముదిరాజ్, మన్నే బాలేష్ లతో పాటు పలువురు యువకులు బీజేపీలో చేరడంతో వారికి ఈటెల రాజేందర్ కాషాయ కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారని వారు తెలిపారు.
మనోహరాబాద్ మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని ఈటెల తెలిపినట్లు వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బక్క వెంకటేష్ గౌడ్, సింగం శ్రీకాంత్ , మండల ఉపాధ్యక్షులు కొత్తూరి నరేష్ గౌడ్, కుంట మహేష్, కుమ్మరి కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ వెంకటేష్ చారి, మామిళ్ళ ప్రణయ్, విజయ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు తలారి ప్రసాద్, శక్తి కేంద్రం ఇంచార్జ్ చాకలి మల్లేష్, బూత్ అధ్యక్షులు రాజేష్ గౌడ్, మేకల గణేష్, లింగం, రాజు, సురేందర్ రెడ్డి, శేఖర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.