- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిచ్చికుక్క స్వైర విహారం..నలుగురు విద్యార్థులపై దాడి
దిశ,పటాన్ చెరు : పిచ్చికుక్క స్వైర విహారం చేసి పాఠశాలకు వెళ్తున్న నలుగురు విద్యార్థులపై దాడి చేసిన ఘటన అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట దుర్గా నగర్ కాలనీలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళుతున్న విద్యార్థులపై పిచ్చికుక్క దాడికి ప్రయత్నించింది. నలుగురు విద్యార్థులకు కుక్క కాటు వేయడంతో వారు తీవ్ర గాయాలపాలై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క స్వైర విహారం పై స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడంతో కుక్కను పట్టుకునేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు.
చివరకు స్థానిక భవన నిర్మాణ కార్మికులు కుక్కని వెంబడించి చంపేశారు. గత కొంతకాలంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కుక్కల కట్టడికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పిచ్చికుక్కల దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కుక్కల నియంత్రణకు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఎక్కడైనా గుంపులు గుంపులుగా కుక్కలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మున్సిపల్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.