- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్లు ప్రజలను మోసం చేసిన పద్మను ఇంటికి పంపుదాం..!
దిశ, మెదక్ ప్రతినిధి : పదేళ్లు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయకుండా మోసం చేసిన పద్మను ఇటింటికి పంపాలని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారం మెదక్ మండలం పాతుర్, రాయీన్ పల్లి, మక్తాభూపతి పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పదేళ్లపాటు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన పద్మ నియోజక వర్గ అభివృద్ధికి ఏమీ చేసిందని ప్రశ్నించారు. ఐదు ఎకరాల భూమిని వందల ఎకరాలు మార్చుకుందనీ ఆరోపించారు. అన్ని జిల్లాలో ఉన్న ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు మినహా మెదక్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఒక్కటైన ఉందా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రం మెదక్ లో పిల్లలకోసం కనీసం పార్క్ కూడా నిర్మించని అసమార్ధపు ఎమ్మెల్యే మళ్ళీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
సిద్దిపేటలో రెండు రింగ్ రోడ్డులు ఉంటే మెదక్ లో కనీసం ఒక్కటి కూడా ఉందా అని ప్రశ్నించారు. డైనోసార్ పార్క్ లు, కోమటి చెరువులు సిద్దిపేటలో ఉంటే మెదక్ లో ఎమ్మెల్యే చేసింది ఏమిటని నిలదీశారు. మినీ ట్యాంక్ బాండ్ పేరుతో యేళ్లుగా కాలం వెల్లడిస్తున్నారు అని అన్నారు. పేదల కోసం కూడా చేసింది ఏమీ లేదన్నారు. డబుల్ బెడ్రమ్ ఇల్లు ఎక్కడైనా ఇచ్చారా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో తాను ఓట్లు అడుగుతానని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన గ్రామాల్లో ఓట్లు అడిగేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఎమ్మెల్యే సొంత గ్రామం కొనాపుర్ సొసైటీలో మూడు కోట్ల అవినీతికి దేవేందర్ రెడ్డి చేశాడని విమర్శించారు. చివరకు ఏడుపాయల అమ్మ వారి బంగారం కూడా వదలలేదనీ ఆరోపించారు. ఒక్క సారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని, పదేళ్ల ముందుకు పోయే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సారి ఒక్కసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.