- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్మి ఓటేస్తే రోడ్డుపై పడ్డారు... : ఈటల
దిశ, తూప్రాన్: అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల 5600 ఎకరాల భూమిని లాక్కుని ప్రజలను కేసీఆర్ రోడ్డుపాలు చేశారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మరోసారి ఓటేసి మోసపోవద్దు, బీఆర్ఏస్ నాయకులను గ్రామాల్లో తిరగనియొద్దు అని సోమవారం ఆయన తూప్రాన్ మండల పరిధిలో నిర్వహించిన రోడ్డు షో లో అన్నారు. ఇమాంపుర్ గ్రామంలో ప్రారంభించిన రోడు షో కి భారీ ఎత్తున ప్రజలు, నాయకులు హాజరై గజమాలతో స్వాగతం పలికారు. మంచి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ రాజుల బ్రతుకుతున్న రైతుల భూములు తక్కువ ధరకు లాక్కుని వేల కోట్ల కమీషన్ల్‌లు పొందిన దౌర్భగ్యపు ప్రభుత్వం బీఆర్ఎస్ అని మండిపడ్డారు.
వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించి కష్టం నమ్ముకున్న వాళ్ళని రోడ్డుపై మొక్కజొన్న కంకులు, పండ్లు అమ్ముకునే దీనస్థితికి కారణం కేసీఆర్ కదా అని అన్నారు. ఎన్నడూ లేని బీఆర్ఎస్ బ్రోకర్ లు, నాయకులు ఇప్పుడు వస్తున్నారు, దావత్‌లు ఇస్తారు, కుల సంఘాలతో మీటింగ్‌లు పెడుతున్నారు. మరోసారి వారి భ్రుమలో పడి ఓటేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. కాయకష్టం చేసి పిల్లలను చదివిస్తే వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్ లు వేస్తూ పపేర్ లీక్ చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఆశీర్వదిస్తే కంటికి రెప్పలా మిమ్మలిని కాపాడుకుంట...
ఇన్ని రోజులు మోసపోయింది చాలు ఒక్కసారి మీ ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి అందిస్తే మీ కష్ట సుఖాల్లో ఉంటానని నోటీసులు ఇచ్చిన భూములు తిరిగి వారికే ఇస్తామని హామీనిస్తున్నమని ఈటల రాజేందర్ అన్నారు. బీసీ వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని దొరల పాలన నుంచి మనకు విముక్తి సమయం దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గాంటి రామ్మోహన్, రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, మండల అధ్యక్షుడు మహేష్ నరేందర్ చారి, అయ గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.