- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్య మహిళను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి
దిశ, ఝరాసంగం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి అన్నారు. మంగళవారం ఆమె ఝరాసంగం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య మహిళ వివరాలను డాక్టర్ రమ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ఆరోగ్య మహిళ కేంద్రాలు ఉన్నాయని త్వరలోనే జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్‌యాసిడ్, ఐరన్ లోపంతో పాటు విటమిన్ బీ 12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు పంపిణీ చేస్తామన్నారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షలు చేసి, అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి, వైద్యంతో పాటు అవగాహన కల్పించి, అవసరమైన వారికి అల్ట్రా సౌండ్ పరీక్షలతో మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
రోగులపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం
ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఝరాసంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఆసుపత్రికి వచ్చిన మహిళలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వారు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తగు ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు.