- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీష్ రావుకు అహంకారం తగ్గలేదు
దిశ, చిన్నశంకరంపేట: మాజీ మంత్రి హరీష్ రావుకు అహంకారం తగ్గలేదని, 26 ఏళ్ల యువకుడు నువ్వు మద్దతుగా నిలిచిన అభ్యర్థి ఓడిపోయిన హరీష్ రావులో అహంకారం తగ్గలేదని, మునిగే నావలో నుంచి బయటకు రావాలని ఆర్ఎస్ నేతలకు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూట్ కేస్ ఎవరిస్తే వారికి టిక్కెట్ ఇస్తున్నారని మెదక్ నుంచి ఉద్యమకారులు ఎవరు లేరా? అని ప్రశ్నించారు. గుర్తించి టికెట్ ఇవ్వరని ప్రశ్నించారు. సూట్ కేసులో డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంటుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందని, గెలిచేవారికి బలాన్ని ఇస్తూ, తోడుగా నిలబడాలన్నారు. మునిగే నావలో నుంచి బయటకు రావాలని బీఆర్ఎస్ నేతలకు రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా త్వరలో శ్రీకృష్ణ జన్మ స్థానం వెళ్లడం తప్పదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలు గెలిచి మోడీకి బహుమతి ఇద్దామని, దేశంలో మోడీ ఎన్నో పనులు చేశాడని, అడగకపోయినా ప్రజల కోసం పథకాలు తెచ్చారని వివరించారు. గల్లీలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మాత్రం మోదీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పునాదులు కదిలిపోతున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, జిల్లా మోర్చా అధ్యక్షుడు జనగాం మల్లారెడ్డి, బాగా గౌని సురేష్ గౌడ్, శ్రీకాంత్ నరేందర్ రెడ్డి, గణేష్ నాయక్, బూతు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.