- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మదన్ రెడ్డి
దిశ, నర్సాపూర్:ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.సోమవారం మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు పథకాన్ని సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం తీసుకొచ్చాడని గుర్తు చేశారు.
కంటి వెలుగులో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు అవసరం ఉన్న వారికి కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ కంటి వెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, ఎంపీపీ వెంకట నర్సింగ్ రావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, సర్పంచ్ పోచమ్మ, వార్డు సభ్యులు, గ్రామ మహిళ సంఘాల సభ్యులు, తదితరులు హాజరయ్యారు.
- Tags
- MLA Madan Reddy