- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సమస్యలపై స్పందించినప్పుడు జెండాలు, అజెండాలు పక్కన పెట్టాల్సిందే
దిశ, హుస్నాబాద్ ; ప్రజా సమస్యలపై స్పందించాల్సి వచ్చినప్పుడు జెండాలు అజెండాలు పక్కన పెట్టాలని ఎన్నికల వరికే రాజకీయం తర్వాత కలిసి ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గౌడన్న లకు హామీ ఇచ్చిన మేరకు హుస్నాబాద్ మండలం పొట్లపల్లి తాటి వనంలో మొక్కలు నాటి రెండు బోర్లను ప్రారంభించారు. అనంతరం గౌడన్నలచే తాటి వనంలో కల్లును సేవించారు. వారితో భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.... గతంలో అగ్ని ప్రమాదం వల్ల చాలా తాటి చెట్లు ఈ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అయ్యాయని, గౌడ సోదరులు చెట్లు ఎక్కడానికి గాని ఇక్కడికి రావడానికి గాని ఈ ప్రాంతమంతా ముళ్ళ పొదలతో నిండి ఉండేదని చెట్లు ఎక్కడానికి గౌడ సోదరులు పడే ఇబ్బందులు చూసి చలించిపోయానని అందుకోసమే వారికి మంచి పని చేయాలని తలంపుతో 28 రోజులపాటు 10 ఎకరాల తాటి వనంలో బ్లేడు బండ్లతో చదును చేయించి వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో నాటిన మొక్కలు బోర్ల ద్వారా వచ్చే నీటితో ఎదిగి వారు ఉపాధి పొందేలా ఉండాలన్నారు. అందుకోసమే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వచ్చానని తెలిపారు.
అనంతరం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లిలో హుస్నాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాలరావు తండ్రి కొంత అనారోగ్యంతో ఉండడంతో వెళ్లి పరామర్శించారు. అలాగే అక్కన్నపేట మండలం పంతులు తండా గ్రామానికి చెందిన కరంటోతు స్వరూప, కరంటోతు కవిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ పర్యటనలో మంత్రి వెంట బిజెపి పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, వృక్ష ప్రసాద ధాత బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బీజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.