డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకే కేటాయించాలి.. కలెక్టర్ మను చౌదరి

by Nagam Mallesh |
డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకే కేటాయించాలి.. కలెక్టర్ మను చౌదరి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : గజ్వేల్ పట్టణంలోని నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అసలైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మల్లన్న సాగర్ అర్ అండ్ కాలని వాసుల సమస్యలు, గజ్వేల్ రెండు పడక గదుల సమస్యలు, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గజ్వేల్ డబుల్ బెడ్ రూంలలో ప్రస్తుతం ఇండ్లలో నివసిస్తున్న వారితో సమావేశం నిర్వహించి చర్చలు జరపాలని ఆర్డివోకు సూచించారు. మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసుల నష్టపరిహారం, ఓపెన్ ప్లాట్లు అందజేత, ఆర్ అండ్ కాలనీలో మౌలిక వసతులు కల్పన, గుడి, బడులకు సంబంధిత విషయాల గురించి విసృతంగా చర్చించారు. మల్లన్న సాగర్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి దశల వారిగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ లకు సూచించారు. భూసేకరణ భూమి విలువ ను లెక్క కట్టడం కోసం కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీవో, జాయింట్ రిజిస్టర్ అర్బన్ లో మున్సిపల్ కమిషనర్, రూరల్ లో జిల్లా పంచాయతీ అధికారి సభ్యులని తెలిపారు. ఈ సమీక్షలో సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, బన్సీలాల్, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story