సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయ్ : ఎమ్మెల్యే

by Kalyani |
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయ్ : ఎమ్మెల్యే
X

దిశ, జహీరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రంలో తెలియని కుట్రలు జరుగుతున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ జతకట్టి కుట్ర పన్నుతున్నాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలనాత్మక ప్రకటన చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో పార్టీ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన "సీపీఐ పార్టీ 100వ వార్షికోత్సవ" సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై పలు ఆరోపణలు చేస్తూనే.. మిత్రపక్షానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో అవకాశం దొరికినప్పుడల్లా విపక్షాలు గందరగోళం సృష్టిస్తూ, రచ్చ చేస్తున్నారని, సమస్యలు పక్కదారి పట్టేలా చూస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో లా అండ్ అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు తోడు దొంగల్లా ఏ చిన్న సందర్భం దొరికిన రచ్చ చేసేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు.

సీఎం మారుస్తున్నారని వారు చెప్పడం హాస్యాస్పదమని, ఆయనకు కాంగ్రెస్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కు మిత్రపక్షగా ఉపరిపాలనకు చేసే సూచనలు పరిగణలోకి తీసుకొని విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ ల ఆట కట్టించాలని పేదలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా దేశంలో 400 పైగా సీట్లు వస్తాయని ఊహించిన బీజేపీ ప్రజల చేతిలో బంగపాటు తప్ప లేదన్నారు. హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా వారు గెలుస్తారని ఊహించలేదని, అక్కడి కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల ఆ ఫలితం వచ్చిందన్నారు. అయినా మతం పేరుతో ఇంకా చలామణి కావాలని చూడడం సరికాదన్నారు. మతం పేరుతో ఓట్లు అడగే హక్కు వారికి లేదన్నారు. సికింద్రాబాద్ లో విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారని , ఏ మతానికి చెందిన విగ్రహాలై పడగొట్టడ సరికాదన్నారు.

అదే సమయంలో రాజకీయాలు కూడా చేయడం సరికాదంటూ హితవుపలికారు. విగ్రహాలు ధ్వంసం చేసినా, క్రిస్టియన్లు, ముస్లింలకు వ్యతిరేకంగా ఈ కార్యకలాపాలు చేసిన వ్యతిరేకిస్తామన్నారు. మత రాజకీయాలు తప్ప బీజేపీ కి వేరే పని లేదా అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం ఇంతవరకు ఏమైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ లో పక్కగా జోడి కట్టారని రేవంత్ రెడ్డిపై ఒకరి తర్వాత ఒకరు ఆరోపణకు గుప్పిస్తూ స్క్రోలింగ్ పెడుతూ , ఆ బాసు పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంగా అడిగే హక్కు వారికున్నా.. అది హద్దులు మీరుతోందని హెచ్చరించారు. కేంద్ర లోని బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది ప్రజల కోసం ఏదైనా పేద ప్రజల కోసం ఏదైనా చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ లు 10 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నాయని పేద ప్రజల కోసం ఏదైనా చేసారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మొదట కొంత చేసినప్పటికీ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులు, కుంభకోణాల రాష్ట్రంగా చేశారని ఆరోపించారు.

10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంకా సర్దుబాటు చేసుకోలేదని , పాలన పట్ల ఇంకా అవగాహన కుదరటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ కు సీపీఐ పూర్తిగా సపోర్ట్ చేశామని.. స్నేహితులు పడిపోవాలని తమకేకోసాన ఉండదని , అందుకే పూర్తి కాలం పాటు అధికారంలో ఉండాలని, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. గోతి కాడి నక్కల తప్పుల కోసం కాచుకొని కూర్చుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ లకు అవకాశం ఇవ్వరాదన్నారు. రాష్ట్రంలో లక్షలాదిమంది పేద ప్రజలు ఉన్నారని, వారి కోసం, వారి సంక్షేమం కోసం, వారి పిల్లల కోసం ఆలోచించాలని సీఎం ను కోరారు. హైడ్రా తో కొంత చెడు జరుగుతుందని , మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. హైడ్రాతో పెద్దలకంటే పేదలకు ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఈనెల 14వ తేదీన పెద్దల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

ప్రతి నియోజకవర్గంలో పేదలకు పంచేందుకు ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని పరిశీలించి పైసా ఖర్చు లేకుండా పేదలకు పంచి మేలు చేయాలని కోరారు. జహీరాబాద్ లో భూదాన్ భూమితో పాటు ప్రభుత్వ భూములున్నాయని వీటిని పేదల ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంచి పనులు చేసేందుకు అవకాశం ఉందని వాటిపైని ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టాలని సూచించారు. వందేళ్ళ వీరోచిత చరిత్ర కలిగిన పార్టీ దేశంలో సీపీఐ మాత్రమే అన్నారు. సంవత్సరం పాటు ఉత్సవాలు జరుపుతూ పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు (సీపీఐ) పార్టీ మిత్రపక్షం చేసే సూచనలు కాంగ్రెస్ పరిగణలోకి తీసుకొని విపక్షాల ఆట కట్టించాలని, పేదలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed