- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రగ్స్ మాఫీయాపై ముఖ్యమంత్రి సీరియస్
దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలో డ్రగ్స్ మాపీయాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై అధికారులతో రివ్యూ చేశామన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే డ్రగ్స్ మాఫియా, అక్రమ మైనింగ్ లపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. వైద్య శాఖ మంత్రి దామోదర్ ప్రతి సమావేశంలో కూడా అక్రమ మైనింగ్, డ్రగ్స్ మాఫియాపై అధికారులను హెచ్చరిస్తున్నారన్నారు. ఆ విధంగా
జిల్లాలో కూడా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అధికారులు జిల్లాలో డ్రగ్స్ మాఫియాకు సంబంధించి పూర్తి రిపోర్టుతో రావాలన్నారు. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఫారెస్టు, ల్యాండ్ అక్యూపేషన్ పై, రైతు రుణమాఫీ, ఫ్రీ విద్యుత్, రూ.500 సిలిండర్ అమలుపై సమీక్షించామని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం వైద్యం, విద్యపై అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 81 సబ్ సెంటర్ లు కట్టడానికి మంజూరు చేశామని, వాటికి కేటాయించిన నిధులు సరిపోవని అధికారులు చెప్పడంతో అదనంగా ఒక్కో సబ్ సెంటర్ కు రూ.6 లక్షలు కేటాయించామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- కొండా సురేఖ