- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
దిశ, సంగారెడ్డి : భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్న పేద ప్రజలకు అనుకూలమైన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ పరిశ్రమలకు దోచిపెడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. జయరాజు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో సీపీఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ… నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమ పథకాలను రోజురోజుకు విస్మరిస్తూ పెట్టుబడిదారులను కార్పొరేట్ పారిశ్రమలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ దేశంలో ధనవంతులు ఇతర దేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకు వస్తానని చెప్పి 10 సంవత్సరాలు కావస్తున్నా ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడం చాలా దారుణమన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా నడుస్తుందని ప్రజల పట్ల ప్రేమ మమకారం లేదని హిందూ పేరుతో రాజకీయాలు చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని దీనికి వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు యాదగిరి, నర్సింలు, రాజాయ్య, మని, రజిత, మల్లమ్మ, పద్మమ్మ, సునీత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.