- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అందోలు’లో నర్సింగ్ కోర్సులకు అడ్మిషన్‌లు ప్రారంభం
దిశ, అందోల్: అందోలులో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాలలో చేరేందుకు అడ్మిషన్‌లు ప్రారంభమయ్యాయి. కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు ఈ నెల 13వ తేదీ వరకు చివరి రోజు కావడంతో అడ్మిషన్‌ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. నియోజకవర్గంలో మరో ఉన్నతమైన విద్యనభ్యసించేందుకు అనుకూలంగా నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే తనదైన గుర్తింపును తెచ్చుకునేందుకు అందోలుకు నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జేఎన్‌టీయూ, పీజీ, అగ్రి, జనరల్ పాలిటేక్నిక్ వంటి ఇతరత్ర ఉన్నత విద్య సంస్థలను నెలకొల్పారు. నర్సింగ్ కళాశాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడంతో అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. నాలుగేండ్ల పాటు బీఎస్‌సీ నర్సింగ్ కొర్సులో చే రేందుకు విద్యార్థీనిలు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
60 మంది చేరేందుకు అవకాశం
అందోలు వద్ద ప్రారంభంకానున్న నర్సింగ్ కళాశాలలో 60 మంది వరకు చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతులనిచ్చింది. ఈ మేరకు అధికారులు అడ్మిషన్‌ల ప్రక్రియను ప్రారంభించగా, ఈ నెల 13వ తేదీ వరకు చివరి అవకాశం కావడంతో కౌన్సిలింగ్‌ను పూర్తి చేసుకున్న విద్యార్థీనీలు కళాశాలలో చేరుతున్నారు. బీఎస్‌సీ నర్సింగ్ కొర్సులో 60 మంది చేరేందుకు అవకాశం కల్పించినప్పటికీ, ప్రస్తుతానికి 52 మందిని చేర్చుకునేందుకు ప్రభుత్వం అలాట్‌మెంట్ ఇచ్చిందని, ఆదివారం నాటికి 42 మంది కళాశాలలో అడ్మిషన్‌లు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. ఇప్పటికి రెండు కౌన్సిలింగ్‌లు పూర్తికాగా, మూడో కౌన్సిలింగ్ ద్వారా మిగతా వారు చేరేందుకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.
నర్సింగ్ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు
అందోలు వద్ద నూతన పీజీ భవనంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి దామోదర్ చేతుల మీదుగా నర్సింగ్ కోర్సులు ప్రారంభం కానుండడంతో అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సీసీ రోడ్డు, భవనంలో ప్లోరింగ్, డోర్‌లు, కిటీకీలు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం వంటి వాటితో పాటు కళాశాల ముందు మొరంతో చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను ఎప్పటికప్పుడు మంత్రి దామోదర్ పర్యవేక్షించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నర్సింగ్ కళాశాలకు స్వంత భవనం పనులు పూర్తయ్యేంతవరకు నర్సింగ్ కళాశాల విద్యార్థీనీలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కలిగి ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
నూతన భవానికి రూ.43 కోట్లు మంజూరు
అందోలు వద్ద నూతనంగా మంజూరైన నర్సింగ్ కళాశాలకు స్వంత భవనం కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ రూ.43 కోట్లను మంజూరు చేశారు. భవన నిర్మాణాన్ని అందోలు వద్దనున్న గుట్టపై 1141 సర్వేనంబర్‌లో నిర్మించేందుకు స్థలాన్ని ఎంపిక చేశారు. నర్సింగ్ కళాశాల నిర్వహణను పీజీ కళాశాల నూతన భవనంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తరగతుల ప్రారంభం రోజునే నర్సింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనను మంత్రి దామోదర్ చే యనున్నట్లు అధికార వర్గాలు తెలిపా
ఈ నెలలోనే తరగతులు ప్రారంభం: పద్మ, కళాశాల ప్రిన్సిపాల్
నర్సింగ్ కళాశాలకు సంబంధించి అడ్మిషన్ ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం 52 మందిని చేర్చుకునేందుకు అనుమతినివ్వగా, ఇప్పటివరకు 42 మంది అడ్మిషన్లను పొందారు. ఈ నెల 13వ తేదీ వరకు కళాశాలలో చేరేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం మూడో కౌన్సిలింగ్ చేపడితే మరి కొందరిని చేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ నెలలోనే కళశాల తరగతులను మంత్రి దామోదర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.