సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవు

by Naresh |
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అనురాధ ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. లోక్ సభ ఎన్నికల పురస్కరించుకొని ప్రత్యేకంగా సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వేదికగా తప్పుడు పోస్టులు పెట్టిన, షేర్ చేసినా పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూం వాట్సప్ నెంబర్‌కు 8712667100 సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ హితవుపలికారు.

Advertisement

Next Story

Most Viewed