- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు...
దిశ, అందోల్: దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జోగిపేట సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. సోమవారం జోగిపేట పోలీస్ స్టేషన్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. గత నెల 21వ తేదీన వట్‌పల్లి మండలం పల్వట్ల గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. పల్వట్లకు చెందిన వెంకట్ రెడ్డి వ్యాపార నిమిత్తం బీదర్ లో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు గ్రామానికి డ్రై వర్ మహిపాల్‌రెడ్డిని వెంట తీసుకు వచ్చేవాడు. గ్రామంలో వెంకటరెడ్డి తల్లి ఒక్కరే ఉండడాన్ని గమనించిన డ్రై వర్ దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. అక్టోబర్ 21వ తేదిన గతంలో చేసిన దొంగతనం కేసులో మహిపాల్‌రెడ్డికి పరిచయమైన మోసిన్, సోహెల్‌తో కలిసి పల్వట్లకు అర్దరాత్రి చేరుకున్నారు.
రాత్రిపూట వెంకటరెడ్డి తల్లి సునంద రెడ్డిని నిద్రలేపి ఇంట్లోకి ప్రవేశించి అదునుచూసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టిపడేశారు. ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు, బంగారు మాటీలు, చెవి రింగులు, రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. సంఘటనపై బాధితులు కుటుంబ సభ్యులు వట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి డ్రైవర్ మహిపాల్‌రెడ్డిని సోమవారం బీదర్ ప్రాంతంలో అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకోవడంతో నిందితుడిని రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. నిందితుడి వద్ద నుంచి పుస్తెలతాడు, దొంగతనానికి ఉపయోగించిన బైకు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ విఠల్, హెడ్‌కానిస్టేబుల్ సుందర్‌రాజ్‌లు ఉన్నారు.