- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభానికి నోచుకోని భోజనశాల..
దిశ,వర్గల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం విన్నూత్నంగా తయారవుతున్నది. పలు మండలాల్లో భవనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ వర్గల్ మండలంలోని లక్షల రూపాయలతో నిర్మించిన భవనాలు మాత్రం ప్రారంభించడానికి నోచుకోవడం లేదు. గ్రంధాలయం, పాఠశాల భవనం, మహిళ సమాఖ్య భవనం, ఇప్పుడు భోజనశాల ఇలా ప్రభుత్వం మారినా అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 500 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. 'మన ఊరు మన బడి 'పథకంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.70 లక్షలు మంజూరు చేసింది. ఇక్కడ భోజనశాల పనులు ప్రారంభించిన గుత్తేదారు నిధులు రాక మధ్యలోనే వదిలేయడంతో విద్యార్థులు మధ్యాహ్న వేళ నేలపై, చెట్ల కింద కూర్చొని తింటున్నారు. ఆగిన భోజనశాల పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.