- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
దిశ, జిన్నారం: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 121 కి పైగా చోరీలకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను జిన్నారంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుధీర్ కుమార్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ కు చెందిన హమీద్ సయ్యద్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని చార్మినార్ లో నివాసం ఉంటున్నాడు. గడచిన 15 ఏళ్లుగా హమీద్ సయ్యద్ అనే వ్యక్తి తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయడం అలవాటు చేసుకున్నాడు. చోరీ చేసిన ఇంటిలోనే తాను వేసుకున్న బట్టలను వదిలేసి, మరో జత బట్టలు వేసుకొని బయటకు వెళ్లి పోలీసులను తప్పుతోవ పట్టిస్తూ చోరీలు చేసేవాడు. తాజాగా గుమ్మడిదల గ్రామానికి చెందిన చిమ్ముల రవీందర్ అనే వ్యక్తి ఇంట్లో ఈనెల మూడవ తేదీన చోరీకి పాల్పడ్డారు.
30 తులాల బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 150 సీసీ టీవీ కెమెరాల ఆధారంగా చోరీ చేసిన వ్యక్తి హమీద్ సయ్యద్ అని గుర్తించారు. ప్రత్యేక టీం గా ఏర్పడి హమీద్ సయ్యద్ ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి నుంచి పోలీసులు పది తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో హమీద్ సయ్యద్ పై 121కి పైగా కేసులు నమోదు అయినట్లు సీఐ సుధీర్ కుమార్ వివరించారు. చోరీ కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎస్సై మహేశ్వర్ రెడ్డి తో పాటు సిబ్బందిని సీఐ సుధీర్ కుమార్ అభినందించారు.