- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాంగ్రెస్పుట్టిన 100 ఏళ్ల తర్వాత కేటీఆర్పుట్టాడు’
దిశ, తెలంగాణ బ్యూరో : “కాంగ్రెస్పార్టీ పుట్టిన 100 ఏళ్ల తర్వాత కేటీఆర్పుట్టాడు. కాంగ్రెస్పార్టీది 140 ఏళ్ల రాజకీయ చరిత్ర. ఆ పార్టీని విమర్శించేందుకు కేటీఆర్కు కనీస అర్హత కూడా లేదు.”అంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అహంకారంతో రాజకీయ దుర్బుద్ధితో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ, నాయకులపై కేటీఆర్ చేస్తున్న అసంబంధ మాటలు, అవాకులు చవాకులు ఆయన అహంకారానికి పరాకాష్ట గా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకులు సన్నాసులు, దద్దమ్మలు అంటూ కేటీఆర్ మాట్లాడడం ఆయన రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అంటేనే ఈ దేశమని, ఈ దేశ చరిత్ర అంటేనే కాంగ్రెస్ చరిత్ర అని గుర్తు చేశారు. స్వాతంత్రం తేవడం కోసం కాంగ్రెస్ నాయకులు వేలాది మంది అనేక రకాల త్యాగాలు చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కేసీఆర్, ఆయన కుటుంబం పదవులు అనుభవిస్తుందంటే అది కాంగ్రెస్పార్టీ పెట్టిన బిక్షనే అనుకోవాలని సూచించారు.కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో మంత్రిగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం కేటీఆర్ రాజకీయ కుతిల నీతికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్గెలుపును ఎవరూ ఆపలేరని మల్లు రవి ఆశాభవం వ్యక్తం చేశారు.