ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తాం : టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

by Kalyani |   ( Updated:2022-11-25 15:09:17.0  )
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తాం : టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
X

దిశ, కల్వకుర్తి : ప్రజలందరికీ పూర్తిస్థాయిలో నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ లతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల స్టాక్‌ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు అవసరమైన అన్ని మందులను ఆసుపత్రిలోనే ఉచితంగా అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌ కు సూచించారు. రోగులకు అందాల్సిన మందుల వివరాలు, సౌకర్యాలు, గర్భిణులకు అందాల్సిన కేసీఆర్ కిట్ వివరాలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్న ముఖ్యమంత్రి కేసిఆర్ కలలను సాకారం చేయడంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ ఐడీసీ సీఈ రాజేందర్, జీఏం ప్రభాకర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ చంద్ర, డాక్టర్ యశోదబాయి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed