కుల వృత్తులను పరిరక్షిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Kalyani |
కుల వృత్తులను పరిరక్షిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: కుల వృత్తులను పరిరక్షించి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బోయపల్లి పరిధిలోని సోమేశ్వర గుట్ట వద్ద కుమ్మరి సామాజిక వర్గానికి కుండల తయారీ కేంద్రానికి కేటాయించిన 2 వేల గజాల స్థలంలో భూమి పూజ నిర్వహించారు. కుల వృత్తులు అంతరించి పోకుండా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తూ స్థలాలు, నిధులు కేటాయిస్తూ కాపాడుతున్నారని చెప్పారు. మట్టినే నమ్ముకొని మనుగడ సాగిస్తున్న కుమ్మరులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.

మట్టి పాత్రల వాడకం వలన ఆరోగ్యపరంగా ఎంతో శ్రేయస్కరమని, తాను కూడా ఇంట్లో మట్టి పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తానని, అందరూ మట్టి పాత్రలనే వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు మోతిలాల్, జాజిమొగ్గ నర్సింహులు, వినోద్ గౌడ్, పత్తి వెంకట్రాములు, శరత్ చంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed