- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రలో యురేనియం మంటలు.. తెలంగాణలో ఇతనాల్ పొగలు
దిశ,అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామం ,రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామం సరిహద్దుల్లో వందల ఎకరాల్లో భూములు కొనుగోలు జరుగుతున్నాయని పలు గ్రామాల్లో అనుకుంటున్నారు. అక్కడ పెద్ద ఇతనాల్ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇతనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాల ప్రజలు కలుషిత బారిన పడే ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు. వీటన్నింటికీ కారణం గత ప్రభుత్వాలు ,కేంద్ర ప్రభుత్వం వేసిన ఉచ్చులో చిక్కుకున్నాయా ? లేక కంపెనీల మోజులో ప్రజల నాశనానికి నాయకులు ఒడిగడుతున్నారా ? ప్రజల అనుమతి లేకుండా దళారుల ద్వారా వందల ఎకరాలు కొనుగోలు చేసి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారా ? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీల ఏర్పాటు వలన రెండు రాష్ట్రాల నదులు కృష్ణ,తుంగభద్ర జలాలైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కలుషితమేర్పడి ప్రజలు నాశనం అయ్యే అవకాశం ఉండదని నిపుణుల అంచనా. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన హిందూపురం అనే గ్రామం దగ్గర ఏకంగా కృష్ణా నదికే గండి ఏర్పాటు చేసి దాదాపు సుమారు 0.2 టీఎంసీల నీటిని మళ్లించి కంపెనీలకు వినియోగిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
ఆనాడు కేసీఆర్ తుంగభద్ర నది దగ్గర కుర్చీ వేసుకుని కొజోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామం ,రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామం సరిహద్దుల్లో వందల ఎకరాల్లో భూములు కొనుగోలు జరుగుతున్నాయని పలు గ్రామాల్లో అనుకుంటున్నారు.ట్లాడి తెలంగాణకు నీళ్లు మల్లిస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. లోపాయికారిగా కేంద్రప్రభుత్వానికి తుంగభద్రా నదిని తాకట్టు పెట్టాడా ? అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ఇట్టి విషయంపై రెండు రాష్ట్రాల నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని పచ్చని పంట పొలాలను నాశనం చేసి, జలాలను కలుషితం చేసి ప్రజల నాజనానికి వడిగడుతున్నారని అనుకుంటున్నారు. ఇదే జరిగితే నది పొడవున ఉన్న కొన్ని వందల గ్రామాలు కొన్ని వేల ఎకరాలు విషతుల్యమై పంటలు పండక ప్రజలు అడుక్కుతినే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామవాసులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో పలు గ్రామాలు ఏ రచ్చబండ దగ్గర చూసిన,నలుగురు కూడి మాట్లాడుకున్న ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. కావున పాలకులు ఇకనైనా మేలుకొని ఇటువంటి కంపెనీల అనుమతులు రద్దుచేసి గ్రామ సీమలను పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం చేయాలని ప్రజలు ప్రాధేయపడుతున్నారు.