- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కురుమూర్తి స్వామి భక్తులకు సౌకర్యాలు కరువు
దిశ,చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలోని సప్తగిరిలో వెలసిన శ్రీ కురుమూర్తి వేంకటేశ్వరస్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. స్వామి వారికి ప్రతీ ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతున్నా..భక్తులకు వసతులు కల్పించడంలో దేవాదాయశాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రేకుల షెడ్లల్లోనే భక్తులు స్వామి వారికి నైవేద్యం వండుకుంటున్నారు. ప్రతీ సారి బ్రహ్మోత్సవాలు,అమావాస్య,ప్రత్యేక పండుగల సమయాల్లో,శనివారాల్లో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి స్వామివారికి దాసంగాలు పెట్టి,తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తారు. కానీ నైవేద్యం వండేందుకు గానూ భక్తులు తగిన వసతులు లేక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా షెడ్లు లేకపోవటంతో.. స్వామి వారి నైవేద్యాలకు సంబంధించిన వంటలు గుట్ట కింది భాగంలోని జాతర మైదానంలోనే మండుటు ఎండలో దాసంగాలు పెడుతున్నారు. దాసంగాలకు మరిన్ని షెడ్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.