- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RS Praveen Kumar : ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలి..
దిశ, గద్వాల : మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే కాకుండా.. దొంగతనం నింద మోపడంతో అవమాన భారంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు రాజేశ్వరి మృతికి కారణమైన సీడ్ ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Former minister Srinivas Goud ),ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen కుమార్)డిమాండ్ చేశారు. సోమవారం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో మృతురాలి తల్లిని కలిసి కూతురు రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం నేరం కాగా.. మరోవైపు బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం క్షమించరానిదన్నారు. ఫిర్యాదును స్వీకరించి విచారించిన ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మైనర్ బాలికను సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలో విచారించాల్సింది పోయి అధికార దర్పానికి,రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదని,ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయని, అధికారంలో ఎవరు శాశ్వతం కాదని విధుల పట్ల నిజాయితీగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.